Friday, September 19, 2025

మైలార్దేవ్పల్లిలో లారీ బీభత్సం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లా పరిధిలోని మైలార్దేవ్పల్లిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ కంట్రోల్ తప్పి ముందు వెళుతున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు.. మృతుడిని అత్తాపూర్ కు చెందిన రాజుగా గుర్తించారు. అత్తాపూర్ నుండి బైక్ పై చంద్రాయన్ గుట్ట వైపు రాజు, అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News