Friday, June 20, 2025

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) అప్ కమింగ్ మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథతో అందరినీ ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నా డు. ఈ చిత్రం సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. విపిన్ దర్శకత్వం వహించిన కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఇది. మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ విపిన్ (Director Vipin) మాట్లాడుతూ “ఇది చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చూసినప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది”అని అన్నారు. నిర్మాత ఉమాదేవి మాట్లాడుతూ “కోయంబత్తూర్‌లో ఒక హిల్ స్టేషన్‌లో ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News