Friday, May 3, 2024

‘కింగ్ మేకర్’ చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Lucifer remake is one of Chiranjeevi's upcoming movies

చిరంజీవి వరస పెట్టి చేస్తున్న సినిమాల్లో లూసిఫర్ రీమేక్ ఒకటి. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకుంటున్నారు. వాటిలో రెండు టైటిల్స్ చిరంజీవికి నచ్చాయట. ‘కింగ్ మేకర్’ అందులో ఒకటి. రెండో టైటిల్ ‘అన్న’ అంటున్నారు. పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఈ సినిమాలో చిరంజీవి కనపడబోతున్నారు. రాజకీయ చదరంగంలో విజేతగా నిలిచే ఓ యోధుడు కథ ఇది. ఎత్తుకుపై ఎత్తులతో కథ, కథనం నడుస్తుంది. ఈ సినిమా కాన్సెప్టుకు తగ్గట్లు చూస్తే ‘కింగ్ మేకర్’ ది బెస్ట్ టైటిల్ అనిపిస్తుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. అలాగే టైటిల్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక ఈ రీమేక్ విషయానికి వస్తే… తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేశారు. మెగా అభిమానుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేర్పులు చేశారని సమాచారం. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్.బి చౌదరి, ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News