Thursday, May 2, 2024

మరో అద్భుతానికి వేదిక కానున్న భాగ్యనగరం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్
కూకట్‌పల్లిలో దేశంలోనే అతిపెద్ద మెగా షాపింగ్ మాల్
రూ.300 కోట్లతో నిర్మాణం.. రెండు వేల మందికి ఉపాధి కల్పన
26వ తేదీన మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్ : భాగ్యనగరం మరో అద్భుతానికి వేదికకానుంది. దేశంలోనే అతిపెద్ద షామింగ్ మాల్ హైదరాబాద్‌లో ప్రారం భానికి రెడీ అవుతోంది. యుఎఇకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మెగా షాపింగ్ మాల్‌ను ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. లులూ మాల్స్ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన అన్ని మాల్స్‌తో పోల్చితే కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నది అతి పెద్దదని తెలుస్తోంది. కూకట్‌పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను రీమోడలింగ్ చేసి లులూ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం లులూ గ్రూప్ సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 5 లక్షల చదరపు మీట్ల విస్తీరణంలో ఈ మాల్ ఏర్పాటైంది.

ఈ మాల్ ద్వారా ఏకంగా 2 వేల మందికి ఉపాధి కల్పన జరగనుంది. ఈ మాల్‌లో 200కిపైగా దుకాణాలు ఉంటాయి. అంతేకాకుండా 5 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్రీన్ కెపాసిటీ ఏకంగా 1400 సీట్లు కావడం గమనార్హం. ఒకేసారి 3వేల కార్లను పార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ మాల్ నిర్మితమైంది. అలాగే మాల్‌లో ఫుడ్ కోర్ట్‌తో పాటు, చిన్నారులకు ప్లే ఏరియా వంటివి సైతం నిర్మించారు. ఇదిలా ఉండగా లులూ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 5 ఏళ్లలో ఏకంగా రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో శివారుతో పాటు తెలంగాణలోని పలు ప్రధాన పట్టణాల్లో మినీ మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ ముందుకొచ్చింది. 2022లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కెటిఆర్ సమక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఇక హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రముఖ పట్టణాల్లో సుమారు రూ. 1000 కోట్లతో మినీ మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News