Sunday, May 5, 2024

రాజగోపాల్‌రెడ్డిని విమర్శించిన మధుయాష్కీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిదేనని, షర్మిల కుటుంబమే కాంగ్రెస్ కుటుంబమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వాళ్లు దూరం అయ్యారు కానీ, కాంగ్రెస్ వారిని వదులుకోలేదని ఆయన తెలిపారు. ఆయన శనివారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి లాభమన్నారు. పార్టీలోకి కాంట్రాక్ట్ కోసమా, పార్టీ కోసం పనిచేయడానికి వస్తున్నారో అనే

విషయాలను తేల్చుకోవాలంటూ పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.పార్టీ స్థానిక నాయకులకు అన్యాయం జరగకుండా చూడాలని, దీనిపై చర్చ జరగాలన్నారు. బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పార్టీ అధికారంలోకి రావడం సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా పార్టీలోకి వస్తే పార్టీ గెలుస్తుందనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. కర్ణాటకలో మాజీ సిఎంలు వచ్చినా బిజెపి వాళ్లు ఓడిపోయారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News