భోపాల్: కన్న కూతురును కాపాడాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. కన్న కూతురుపై తండ్రి పలుమార్లు అత్యాచారం చేశారు. కూతురుకు పసికందు జన్మించడంతో చెట్ల పొదల్లో నవజాత శిశువును పడేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్నారు. కూతురు ఒంటరిగా ఉన్నప్పుడు బెదిరించి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని సొంతూరులో ఉంచాడు.
కూతురు ప్రసవించడంతో ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నవజాత శిశువును ఎత్తుకెళ్లి ముళ్ల కంపలో పడేశాడు. కూతురు ఎక్కువగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. చెట్ల పొదల్లో పసికందు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నవజాత శిశువును ఆస్పత్రికి తరలించారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. బాలికను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తండ్రే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురికి డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.