Sunday, December 15, 2024

మహారాష్ట్రలో విజేతలైన 21 మంది మహిళలు

- Advertisement -
- Advertisement -

228 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మొత్తం 21 మంది మహిళా ఎమ్‌ఎల్‌ఎలు విజయం సాధించగా వారిలో ఒక్కరే విపక్షం కాంగ్రెస్ అభ్యర్థి కావడం విశేషం. బీజేపీ అభ్యర్థుల్లో అత్యధిక సంఖ్యలో 14 మంది మహిళా ఎమ్‌ఎల్‌ఎలుండగా, వీరిలో 10 మంది తిరిగి ఎన్నికైన వారే. వీరిలో శ్వేతామహలే (చిక్లి నియోజకవర్గం), మేఘన బోర్డికర్ (జింతూరు), దేవయాని ఫరాండే (నాసిక్ సెంట్రల్ ) ,సీమా హిరే ( నాసిక్ వెస్ట్) , మండా మహత్రే (బేలపూర్) , మనీషా చౌధరి(దహిసార్), విద్యాఠాకూర్ (గొరెగావ్) మాధురీ మిసాల్ (పార్వతి), మోనికా రాజలే (షివ్‌గావ్ ) నమితా ముండాడ (కైజ్) ఉన్నారు.

బీజేపీకి చెందిన నలుగురు విజేతలైన నూతన మహిళా ఎమ్‌ఎల్‌ఎల్లో శ్రీజయ చావన్ (భోకార్), సులభ గైక్వాడ్ (కల్యాణ్ ఈస్ట్),స్నేహ పండిట్ (వసాయి) అనురాధ చవాన్ (ఫులంబారి), ఉన్నారు. అధికార శివసేన టికెట్లపై మంజుల గవిట్ (సక్రి), సంజన జాధవ్ (కన్నాడ్), విజయం సాధించారు. అధికార ఎన్‌సిపి టికెట్లపై సులాభ ఖోడ్కే (అమరావతి), సరోజ్ అహిరే (డియోలాలి), సనమాలిక్ (అణుశక్తి నగర్ ), అదితి తత్కారే (శ్రీవర్ధన్ ) గెలుపొందారు. విపక్షం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి గైక్వాడ్ (ధావరి ) ఒక్కరే ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నిక కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News