Wednesday, May 1, 2024

మహారాష్ట్ర మంత్రి మాలిక్ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Maharashtra Minister Malik's condition is critical

జెజె ఆసుపత్రిలో చికిత్స…బెయిల్‌పై 5న విచారణ

ముంబై : మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను తీవ్ర అస్వస్థత కారణంగా సోమవారం హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని లాయర్లు తెలిపారు. ఇక్కడి మనీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ అప్పీల్ విచారణ సందర్భంగా ఆయన తనకు జ్వరం , డయోరియా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ఆయన లాయరు కుషాల్ మోర్ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపారు. మాలిక్ ఆరోగ్యం పూర్తిగా దిగజారిందని , విషమ పరిస్థితిలో ఉన్నారని వివరించారు. 62 సంవత్సరాల మాలిక్‌ను గత వారం కేసుకు సంబంధించి స్థానిక అర్తూర్ రోడ్ జైలుకు తరలించారు. వైద్యకారణాలతో తనకు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేయాలని ఇక్కడ ఎంపిలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణల ప్రత్యేక న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నారు.

సోమవారం ఇది విచారణకు వచ్చింది. ఎన్‌సిపి నేత అయిన మాలిక్‌కు ఇంటి భోజనం అందించేందుకు కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లగా ఆయనను స్థానిక ప్రభుత్వ పరిధిలోని జెజె హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారని లాయర్ వివరించారు. అయితే జెజె ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఆరోగ్య పరిస్థితి క్షీణించినందున ఆయనను అన్ని వసతులు ఉండే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వేడుకున్నారు. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎన్ రోకాడే ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు ఎందుకు తెలియచేయలేదని జైలుఅధికారులను నిలదీశారు. లాయర్ అభ్యర్థన మేరకు ఆయనను కుటుంబ సభ్యులు కోరుకునే ప్రైవేటుఆసుపత్రికి తరలించే విషయం పరిశీలన విచారణ ఈ నెల 5న జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు. ఈలోగానే ఆయన ఆరోగ్యంపై పరిస్థితిని ఇప్పుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు పొందుపర్చాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News