Tuesday, April 30, 2024

అమెరికాను ముసురుకున్న మంచు తుఫాను!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాపై మళ్లీ శీతాకాలపు మంచు తుఫాను పంజా విసిరింది. పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1700కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం నాటికి 28 రాష్ట్రాలలో దాదాపు 75 మిలియన్ ప్రజలు శీతాకాల వాతావరణానికి ప్రభావితులయ్యారు. డకోటా, మిన్నెసోటా, విస్కాన్సిన్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. ప్రతికూల వాతావరణ కారణంగా అక్కడ అనేక పాఠశాలలను మూసేశారు. ఇదిలావుండగా వాషింగ్టన్ డిసిలో వాతావరణం దాదాపు 150 ఏళ్ల రికార్డును బద్ధలు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఈదురు గాలులు వీస్తున్నాయి. అవి గంటకు 50 మైళ్లు(80 కిమీ.) వేగంతో వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 50 ఫారిన్ హీట్ డిగ్రీలుగా ఉంది. ఉత్తర రాష్ట్రాలలో మంచు దాదాపు రెండు అడుగులు(60 సెమీ.) మేరకు పేరుకుపోయింది. హిమపాతం దాదాపు 30 ఏళ్లలో అతి పెద్దదిగా నమోదవుతోంది.

తీవ్ర ఇబ్బందులు ఉంటే మోటారిస్టులకు నేషనల్ గార్డ్ సిబ్బంది సాయపడతారని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. రాష్ట్రంలో హిమపాతం రికార్డు బ్రేక్ స్థాయిలో ఉండనుందని అధికారులు తెలిపారు. నెబ్రస్కా నుంచి న్యూ హ్యాంప్‌షైర్ వరకు 1300 మైళ్ల మేరకు మంచు తుఫాను ఉండగలదని ఫోర్‌కాస్టర్లు తెలిపారు.

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా వంటి పొడి ప్రాంతాలలో కూడా మంచు వాతావరణం నెలకొంది. వెంచురా పర్వతసానువుల్లో, లాస్ ఏంజెల్స్ కౌంటీలో మంచు గాలులు గంటకు 75 మైళ్ల వేగంతో వీస్తున్నాయి. మోంటానా ప్రాంతంలో బుధవారం రాత్రి మైనస్ తొమ్మిది ఫారిన్‌హీట్ డిగ్రీల మేరకు శీతల వాతావరణం ఆవరించింది. మాక్లన్, టెక్సాస్, లెక్సింగ్టన్, కెన్‌టుకి, నాష్‌విల్లే, టెన్నెసీలలోనైతే వాతారణం వంద ఏళ్లక్రితం రికార్డును బ్రేక్‌చేసేలా ఉన్నాయి. సిన్‌సిన్నాటి, ఇండియానపోలీస్, అట్లాంట వంటి ఇతర అమెరికా నగరాలలోనైతే అత్యున్నత రికార్డును బ్రేక్ చేస్తోంది వాతావరణం. 1874లో వాషింగ్టన్ డిసిలో ఉన్న రికార్డును బుధవారం బద్దలు చేయడం జరిగింది. గురువారం 80 ఫారిన్‌హీట్ డిగ్రీలను తాకింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News