Thursday, May 2, 2024

55 ఏళ్ల తర్వాత నిర్దోషిత్వం!?

- Advertisement -
- Advertisement -

Malcom X

మాల్కమ్ ఎక్స్ హత్య కేసులో…

కాలిఫోర్నియా: అమెరికాలో మాల్కమ్ ఎక్స్ హత్య కేసులో ముహమ్మద్ అజీజ్(83), స్వర్గీయ ఖలీల్ ఇస్లాం 1966లో నిందింతులుగా అరెస్టయ్యారు. వారిద్దరు కొన్ని దశాబ్దాలుగా తాము నిర్దోషులమని మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ వారి మొరను ఎవరూ ఆలకించలేదు. మానవ హక్కుల దిగ్గజం మాల్కమ్ ఎక్స్ 1965 ఫిబ్రవరి 21న హర్లేంలోని ఔదుబన్ బాల్‌రూమ్‌లో ప్రసంగించడానికి ముందు హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో అజీజ్, ఇస్లాం, ముజాహిద్ అబ్దుల్ హలీమ్(తాల్‌మద్గే హేయర్ లేక థామస్ హగన్) 1966 మార్చిలో యావజీవిత కారాగార శిక్షకు గురయ్యారు.
మాల్కమ్ ఎక్స్‌పై కాల్పులు జరిపిన గన్‌మెన్‌లలో తాను ఒక్కడినని హగన్ ఒప్పుకున్నాడు. కాగా అతడు అజీజ్, ఇస్లాం మిగతా ఆ ఇద్దరా అన్నది ధృవీకరించలేదు. కాగా ఆ ఇద్దరు తాము నిర్దోషులమంటూ దశాబ్దాలుగా వాదిస్తున్నారు. వారు నేరం చేసినట్లు సాక్షాధారాలు కూడా లేవు.
మాల్కమ్ ఎక్స్ ఇస్లాం జాతి గళంగా అమెరికా జాతీయ ప్రఖ్యాతిగాంచారు. ఆయన అమెరికాలో నల్లవారి పౌర హక్కుల కోసం పోరాడారు. బ్లాక్ ముస్లిం ఆర్గనైజేషన్ ద్వారా ఆయన వారికి హక్కుల దక్కేందుకు తనదైన పాత్ర పోషించారు. అయితే ఆయన మక్కా యాత్రకు వెళ్లి వచ్చాక వారి ‘బ్లాక్ ముస్లిం ఆర్గనైజేషన్’ చీలిపోయింది. ఆయన జాతి ఐక్యతకై వాదిస్తుండేవారు. ‘నేషన్ ఆఫ్ ఇస్లాం’లో కొందరు అసూయ, కక్షకొద్ది ఆయనను ద్రోహిగా భావించేవారు. అజీజ్ 1985లోనే విడుదలయ్యారు. ఇస్లాం 1987లో విడుదలయ్యాక 2009లో కన్నుమూశాడు. అయితే ఆ ఇద్దరు తమను నిర్దోషులుగా ప్రకటించమని న్యాయపోరాటం చేశారు. కాగా వారి నిర్దోషిత్వాన్ని నేడు (గురువారం) ప్రకటించారు. అది కూడా దాదాపు రెండేళ్ల పునర్విచారణ తర్వాత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News