Monday, September 22, 2025

నేరెడ్ మెట్ లో కన్న తల్లిదండ్రులు కాటికి పంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ రోజున కన్నతల్లిదండ్రులను కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతంలో జరిగింది.  నేరెడ్ మెట్ లో రాజయ్య(75), లక్ష్మి(65) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంతపులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. రెండో కుమారుడు శ్రీనివాస్ మద్యానికి బానిసగా మారి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులను వేధిస్తుండడంతో మతిస్థిమితం తప్పిందని నెల రోజుల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. నెల రోజుల తరువాత ఇంటికి వచ్చిన అతడు తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిదండ్రుల తలపై కర్రతో బాదడంతో వారు ఘటనా స్థలంలో చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రూ.15 వేల కోట్ల భూమి సేఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News