Tuesday, October 15, 2024

రాహుల్‌కు బెదిరింపులపై త్వరలో ఆందోళన:ఖర్గే

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి విషపూరిత ఆలోచనా విధానానికి తాము భయపడబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై వస్తున్న బెదిరింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ ప్రకటనలు చేసిన తమ బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఖర్గే ఆరోపించారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలతోసహా పలువురు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు తమ నాయకుల నాలుకలు కోస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారని,

నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీపై మాటల దాడులు చేస్తున్నారని ఆయన తెలిపారు. తన నానమ్మ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సృష్టించిన వాతావరణం తరహాలోనే రాహుల్ గాంధీకి కూడా సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని, భయంతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీని, ఉగ్రవాదిగా, జాతి వ్యతిరేకిగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నారని, అటువంటి ప్రకటనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీ వారిని ప్రోత్సహిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News