Sunday, November 3, 2024

దావూద్ గ్యాంగ్ పేరిట మోడీ, యోగికి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తానని ఫోన్ ద్వారా బెదిరించిన వ్యక్తిని పోలీస్‌లు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకొన్నాడు.

ఈ నాయకుల హత్యకు పథకం వేయాల్సిందిగా గ్యాంగ్ తనను కోరిందని పేర్కొన్నాడు. ఇదే సమయంలో ముంబై లోని జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని హెచ్చరించాడు. ఈ కాల్స్‌తో అప్రమత్తమైన పోలీస్‌లు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News