Thursday, February 9, 2023

రంగారెడ్డిలో దారుణం… అన్నను ఆటోతో ఢీకొట్టి చంపిన తమ్ముడు..

- Advertisement -

మనతెలంగాణ/మర్పల్లిః పాత గోడవలను మనుసులో పెట్టుకుని సొంత అన్నను తమ్ముడే ఆటోతో ఢీకొట్టి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిదిలోని జంషదాపూర్ గ్రామంలో బుదవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషదాపూర్ గ్రామానికి చెందిన మేతరి ఏసయ్య బాగమ్మలకు నర్సిములు, ఆశోక్, యాదయ్య ముగ్గురు కుమారులు. ఇందులో యాదయ్య, ఆశోక్‌లు అప్పుడప్పుడు కోన్ని సంవత్సరాలుగా గొడవలు పడేవారు. ఆశోక్ కుటుంబం గతకొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండేవారు.

రెండు సంవత్సరాల క్రితం ఆశోక్ వారి కుటుంబాన్ని అక్కడే వదిలి ఇక్కడకు వచ్చి కూలీ పనులు చేస్తుండేవారు. తాము గ్రామంలోకి వచ్చినప్పుడల్లా తమ మరిది యాదయ్య తమతో గోడవలు పడేవాడని, రాత్రుల్లో తమను వెంబండించేవాడని వారు పెర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం తనను యాదయ్య కొట్టడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురైయ్యానని, తలకు బలమైన గాయం కావడంతో తనకు ఆరోగ్యం సరిగా ఉండదని రెండు రోజులు బాగుంటే నాలుగురోజులు బాగుండదని, తన భర్త తమ కుటుంబానికి దూరం కావడానికి కూడ కారణమయ్యారని మృతిని బార్య చంద్రకళ విలపించారు.

మంగళవారం మృతుని తల్లి ఆరోగ్యం బాగలేదని తెలుసుకున్న కూతురు అల్లుడు గ్రామానికి వచ్చి మంచి చెడులు మాట్లాడింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యాదయ్య, ఆశోక్‌లు మల్లి గొడవలు పడుతుండటంతో విరిద్దరికి అక్క సర్ది చెప్పిన కూడా వారు గోడవలు పడటం మానుకోలేదని గ్రామస్తులు పెర్కొన్నారు. ఇంటిముందన్న దేవాలయం దగ్గర మంగళవారం రాత్రి సుమారు 8, 9గంటల సమయంలో యాదయ్య ఆశోక్‌ను ఆటోతో డికోట్టడంతో చికిత్సకోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు తరలించగా అక్కడ ఆశోక్ పరిస్థితి విషమించడంతో గాందీఆసుపత్రికి తరలించగా చికిత్సపోందుతూ మృతి చెందినట్లు వారు పెర్కోన్నారు.తనకు, తనపిల్లలకు యాదయ్యతో ప్రాణహణి ఉందని తమకు రక్షణ కావాలని పిర్యాదు చేసినట్లు, నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles