Thursday, May 2, 2024

టోక్యో వీధులలో కత్తివ్యక్తి పలువురిపై దాడి.. రైలుకు నిప్పు

- Advertisement -
- Advertisement -

Man with Knife Stabs at Least 10 on Tokyo Train

టోక్యో : జపాన్‌లో చేతిలో కత్తిపట్టుకుని ఓ ఆగంతకుడు భయానక స్థితిని సృష్టించాడు. ఎనమండుగురిని గాయపర్చాడు. టోక్యోలో ఓ ట్రైన్‌కు నిప్పుపెట్టాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగి అతికష్టం మీద ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనితో మరింత తీవ్రస్థితి తప్పింది. ఈ వ్యక్తి జరిపిన కత్తిదాడిలో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. ఈ వ్యక్తి ఎందుకు ఈ విధంగా అరాచకానికి దిగాడనేది వెంటనే తెలియలేదు. ఈ వ్యక్తి తాను ఓ స్టేషన్‌లోకి చొరబడి అక్కడి రైలు బోగీలపై ద్రావకం చల్లి నిప్పంటించినట్లు వెల్లడైంది. రైలుకు మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు నానా పాట్లు పడి, కిటికీల గుండా బయటికి దూకారు. ఈ విధమైన వీధి అరాచకాలు జపాన్‌లో జరగడం చాలా అరుదు. అయితే ఈ ఏడాది ఆగస్టులోనే ఓ వ్యక్తి టోక్యోలోనే ప్రయాణికులపై దాడికి దిగిన దశలో పలువురు కత్తిపోట్లతో గాయపడ్డారు. ఓ వైపు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దశలోనే ఆదివారం దుండగుడు ఈ ఘటనకు దిగాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News