Wednesday, September 24, 2025

దసరాకు సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండక్కి రావాల్సిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ దసరా నుంచే సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఓ సర్‌ప్రైజ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి దసరాకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే ఊపులో దసరాకు ఓ సింగిల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. లిరికల్ వీడియో లేకపోయినా.. దసరాకు మరో రూపంలోనైనా సందడి చేయడం ఖాయం అంటోంది యూనిట్. వెరైటీ ప్రమోషన్స్‌కు పెట్టింది పేరైన అనీల్ రావిపూడి, దసరా లాంటి ఫెస్టివల్ ను ఎందుకు వదులుకుంటాడు. కచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు. అదేంటో త్వరలోనే తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News