Sunday, April 28, 2024

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేష‌న్..

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu filed nomination at MAA Office

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షపదవికి మంచు విష్ణు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మంగళవారం భారీ ర్యాలీగా ‘మా’ కార్యాలయానికి వచ్చిన విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కార్యనిర్వాహక ఉపాధ్యాక్షడిగా మోహబాబు నామినేషన్ వేశారు. ఇక, నిన్న ఉదయం ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం సివిఎల్‌ నర్సింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. రేపటి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, అక్టోబ‌ర్ 10న జరగనున్న మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Manchu Vishnu filed nomination at MAA Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News