Tuesday, May 14, 2024

ఢిల్లీలోని గఫార్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -
Fire in Delhi Gaffore Market
అగ్ని మాపక సిబ్బందిలో ఒకరికి గాయాలు!

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలోని గఫార్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కనీసం డజను దుకాణాలు  ప్రభావితమయ్యాయి.  మంటలను ఆర్పే ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారులు తెలిపారు.

“మా అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు తప్ప ఎటువంటి మరణాలు లేవు. కాగా మంటలు ఎలా చెలరేగాయో తెలియడం లేదు’’ అని డిఎఫ్‌ఎస్ అదనపు డివిజనల్ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. “ప్రస్తుతం అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ప్రధాన ప్రమాదం ఏమిటంటే భవనాలు అగ్నిప్రమాదంలో దెబ్బతిన్నాయి ”అని సింగ్ ఆయన తెలిపారు.

అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గఫార్ మార్కెట్‌లోని షూ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. కరోల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లోని స్వీట్ షాప్ సమీపంలో అగ్నిప్రమాదం గురించి తెల్లవారుజామున 4:16 గంటలకు తమకు కాల్ వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు. గఫార్ మార్కెట్‌లో మంటలను అదుపు చేసేందుకు 39 అగ్నిమాపక శకటాలు పంపినట్లు కూడా వారు తెలిపారు. విజువల్స్‌లో మంటలు రెండవ అంతస్తుకు ఎగబాకడం చూడవచ్చు. మంటలు అదుపులోకి వచ్చినట్లు డిఎఫ్‌ఎస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News