Friday, May 3, 2024

బిఎస్పీ పునర్వ్యవస్థీకరణలో ఆకాశ్ ఆనంద్ పాత్ర

- Advertisement -
- Advertisement -

Akash Anand

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ పార్టీ ఇంతలా ఎప్పుడూ దిగజారలేదు. దీంతో బిఎస్పీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అగ్రవర్ణ కులస్థులకు వారు ఇప్పుడు దగ్గర కావాలనుకుంటున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ పెద్ద పాత్రను పోషించబోతున్నాడు. ఆ పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా చక్రం తిప్పబోతున్నాడు. కాగా పార్టీ మరో కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్‌ను ఎనిమిది ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జీని చేశారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్(55) బిఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నెం. 2 పొజిషన్‌లోనే ఉండబోతున్నారు.

Anand Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News