Saturday, April 27, 2024

ఇద్దరు మెగాస్టార్లతో స్పెషల్ సాంగ్

- Advertisement -
- Advertisement -

Megastar Dance with Salman for Godfather

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి బ్లాస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించే ఓ బాంబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణకు సంబధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. “గాడ్‌ఫాదర్ కోసం భాయ్ సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేశా.

ప్రభుదేవా కొరియోగ్రఫీ వండర్ ఫుల్. ఈ పాట అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగ”అని ట్వీట్ చేశారు మెగాస్టార్. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News