Saturday, April 27, 2024

యోగాతోనే మానసిక పరిపక్వత

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : యోగాతో మానసిక పరిపక్వత రావడమే కాకుండా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ నూతన సమీకృత కార్యాలయ సముదాయ ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సామూహిక యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా వల్ల బుద్ధి, పనిచేసే సామర్థం పెరుగుతుందన్నారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు నేడు దానిని తప్పనిసరి చేశాయని తెలిపారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా సాధన అవసరమన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి ఆరోగ్యం అత్యంత కీలకమన్నారు.

ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు కొంత సమయాన్ని యోగాను తప్పనిసరిగా కేటాయించాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా శరీరం యాక్టివ్‌గా ఉండడమే కాకుండా ఫిట్‌గా తయారవుతుందన్నారు. యోగా మానసిక ఆరోగ్యానికి, శరీర ధృడత్వానికి ఎంతో సహాయ పడుతుందని, ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, తరచుగా పొట్ట సమస్యతో ఇబ్బందులు పడే వారు తప్పకుండా యోగాసనాలు వేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి మహేశ్వరి ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, డిఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్, ఆయుష్ డాక్టర్ గోపాల్, పతాంజలి జిల్లా మహిళా సేవా సమితి అధ్యక్షులు, యోగా ట్రైనర్ సంధ్యారాణి, లక్ష్మి, రేనయ్య, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News