Thursday, May 2, 2024

7 నుంచి మెట్రో సర్వీసులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పరిధిలో ఆన్‌లాక్ 4 మార్గదర్శకాల ఉత్తర్వులను సిఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం కంటైన్మెంట్ జోన్‌లలో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగుతుంది. కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా అన్ని ప్రాంతాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్, భౌతిక దూరంతో లెర్నింగ్‌కు అనుమతించారు. 50 శాతం మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది స్కూల్‌కు వచ్చేలా అనుమతించారు. వీరు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు క్లాసులు బోధిస్తారు.

సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాలకు వెళ్లవచ్చు. ఐటిఐల్లో నైపుణ్య శిక్షణాభివృద్ధి, షార్ట్ టర్మ్ శిక్షణ సెంటర్లకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అనుమతించారు. పిహెచ్‌డి, పిజి, విద్యార్థులు ల్యాబ్, టెక్నికల్ అవసరాలకు ఉన్నవారికి ప్రయోగాలకు వెళ్లవచ్చు. అలాగే సామాజిక, సాంసృతిక, బహిరంగ సభలు, మత ప్రదేశాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వంద మందితో అనుమతించారు. అయితే సెప్టెంబర్ 20వ తేదీ వరకు పెళ్లిలకు 50 మందిని, అంతిమ సంస్కారాలకు 20 మందికే అనుమతి ఉంది. ఆ తరువాతి నుంచి 100 మంది వరకు అవకాశం ఇచ్చారు. బార్లు, క్లబ్‌లు మూతపడే ఉండనున్నాయి. సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, థియేటర్లు తదుపతి ఉత్తర్వుల వరకు మూసే ఉంటాయని పేర్కొన్నారు.

Metro Services resume from Sept 7 in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News