Thursday, May 2, 2024

వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని ఎక్కడన్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీని వంద రో జుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామిన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ‘విద్యుత్- త్రాగునీరు- ఆర్థికం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని డిప్యూటీ సిఎం ధీమా వ్యక్తం చేశారు. తాము అ ధికారం దిగిపోయే నాటికి ఖజానాలో రూ.7 వేల కో ట్లు బ్యాలన్స్ ఉందని బిఆర్‌ఎస్ చెబుతోందని కానీ, నిజానికి మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర ఖజానా రూ.3,960 కోట్లు మైనస్‌లో ఉందన్నారు. రూ.7 వేల కోట్లు ఎవరి అకౌంట్‌లోకి పోయాయని భట్టి ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని, ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదన్నారు.

రూ.3,927 కోట్ల పవర్ సబ్సిడీ చెల్లించాం
రూ.3,927 కోట్ల పవర్ సబ్సిడీ చెల్లించామన్నారు. మార్చి నుంచి 15,673 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని, అయినా కట్ లేకుండా పవర్ అందిస్తున్నామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. ఏప్రిల్, మే లో కూడా పవర్ డిమాండ్ ఎంత పెరిగినా అందుబాటులో ఉం చామని ఆయన తెలిపారు. ఎన్టీపిసి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందిస్తే 8 నుంచి 9 రూపాయల యూనిట్ ఖర్చు అవుతుందన్నారు. కానీ, సోలార్ పవర్ పెడితే 5 రూపాయలకే వచ్చే 25 ఏళ్లకు సప్లై చేస్తాం అంటున్నాయని, అధిక రేటు ఎందుకు పెట్టినట్టు అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ వ్యవహారం పైశాచికత్వం ఉందన్నారు. రూ. 20లకు యూనిట్ విద్యుత్ కొంటుందన్నారు. గ్రీన్ పవర్‌ను రాష్ట్రానికి తక్కువ ధరకు అందిస్తామన్నారు.
నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్ల అప్పులు కట్టాం
డైట్, మధ్యాహ్నం భోజనం నిధులు, మహిళా సంఘాలకు నిధులు ఇచ్చామన్నారు. నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్ల అప్పులు కట్టామని ఆయన చెప్పుకొచ్చారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగాని

కి నష్టం జరుగుతుందని అందుకే ప్రజలకు వాస్తవాలను చెప్పాలని తాను ఇక్కడికి వచ్చానన్నారు.
కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం
కాంగ్రెస్ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సిఎం భట్టి తెలిపారు. సాగునీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.మేడిగడ్డ కూలిందంటే అందులో ప్రజల సొమ్ము ఉందన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియకూడదా..? దాచి పెట్ట డం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది బ్లాక్ మెయిల్ చేశారని, ఫోన్‌లు విని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది తప్పు కాదా? అని డిప్యూటీ సిఎం భట్టి ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వా లిటీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురండి, పరిష్కారం చేస్తానని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలాంటి వారిపై కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రజలను ఆందోళ న కలిగించే ప్రచారం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వం ఉండదని కెసిఆర్ అంటున్నారు, కానీ, తలకిందులు తప్ప స్సు చేసినా ఢోకా లేదని భట్టి సూచించారు.

కొందరు కుట్రదారులు ఆర్ ట్యాక్స్,
బి ట్యాక్స్ పేరుతో అబాసుపాలు
ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్‌లపై భట్టి మాట్లాడుతూ తన లాంటి వాళ్లను అడ్డుకోవడానికి కొందరు కుట్రదారులు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అని ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు. మేమంతో తపనతో రాష్ట్రాన్ని నిర్మించే పనిలో ఉన్నామన్నారు. ఎస్‌ఎల్‌బిసిని పదేళ్లలో అసలు పట్టించుకోలేదని డిప్యూటీ సిఎం ఆరోపించారు. డిండి, నక్కల గండి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రూ.10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఖమ్మంలో 2 లక్షల ఎకరాల భూమిని ఎపికి ఎందుకు ఇచ్చిందో తెలిపాలన్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చి భూములు ఇచ్చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ప్రాణహిత పూర్తి చేయడానికి 3 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కాదు ఇచ్చిందని భట్టి క్లారిటీ ఇచ్చారు. వాటాగా వచ్చిన డబ్బు రూ.3 లక్షల 70 వేల 235 కోట్లు అని డిప్యూటీ సిఎం భట్టి తెలిపారు. నదిలో మన వాటా ఎంత అనేది తేల్చాలన్నారు. కానీ, పదేళ్లు తేల్చలేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు బిజెపి వాళ్లతో నాజోలికి నువ్వు, నీ జోలికి నేను రాను అని మాట్లాడుకున్నారు తప్పితే వాటా కోసం కెసిఆర్ అడగలేదన్నారు. పేదల నుంచి తీసుకున్న అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చే ప్లాన్ చేస్తున్నామని భట్టి చెప్పారు. పాదయాత్రలో హామీల అమలుకు శ్రీకారం చుడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News