Saturday, April 27, 2024

టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం.. బిజెపిది రెచ్చగొట్టే విధానం

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Fires on BJP

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం, బిజెపిది ప్రజలను రెచ్చగొట్టే విధానమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నది బిజెపేనని మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు అన్నారు. ఆదివారం మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ నూతన కార్పొరేటర్‌గా ఎన్నికైన జె.ప్రభుదాస్ కృతజ్ఞత సభలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డిలతో కలసి అయన ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. సందర్భంగా అయన మాట్లాడుతూ… భాగ్యలక్ష్మి, భద్రకాళి ఆలయాలు కాదు బిజెపి కేంద్ర మంత్రులకు దమ్ముంటే ఉంటే అభివృద్దిపై వరంగల్ కార్పొరేషన్‌కు రావాలని సవాలు విసిరారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుంది బిజెపి ఎన్నికల ముందు పాకిస్థాన్ తో యుద్దం అని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నరన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు అని ప్రచారం చేసిన బండి సంజయ్ ఎమైనాయి కేంద్ర నిధులు అని ద్వజమేత్తారు.

విదేశాల నుంచి నల్లదనం తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో లో 15 లక్షల రూపాయలు జామ చేస్తామని చెప్పి అప్పులు చేసిన కుభేరులను దేశం దాటించారని అన్నారు. మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌ను తను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ అభివృద్ది చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ… గడిచిన ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ పురపాలకశాఖ మంత్రి కెటిఅర్‌ల సూచనలతో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని తెలిపారు. ఉప్పల్ ఎంఎల్ఎ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ… మంత్రులు, నగర మేయర్ సహకారంతో ఉప్పల్‌ నియోజకవర్గంలో అత్యాదిక నిదులు వెచ్చించి అభివృద్ది చేసుకుంటున్నమని తెలిపారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ ప్రభుదాస్‌ను మంత్రి మేయర్, ఎంఎల్ఎ ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో సిట్టింగ్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డివిజన్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కిరన్‌కుమార్‌రెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, బోదాస్ రవి, నవీన్‌గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Minister Errabelli Dayakar Rao Fires on BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News