Sunday, April 28, 2024

నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్… నేడు స్వరాష్ట్రంలో బిజెపి

- Advertisement -
- Advertisement -

MInister Harish Rao Fires on BJP And Congress

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీ లు దొందు దొందే అని మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలను విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ బిజెపి కి చెందిన నాయకులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో, మంత్రి హరీశ్ రావు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ…. నాడు సమైక్య పాలనలో 10ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసిందని, నేడు స్వరాష్ట్రంలో ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బిజెపి తీవ్రంగా అన్యాయం చేస్తున్నదన్నారు. బీజేపీ వాళ్లు చెప్పేవి అబద్దాలు. అబద్దాలకు నోబెల్ ప్రైజ్ ఇస్తే అది బీజేపీకే వస్తది. కాళేశ్వరం నీరు రాలేదంటే ఇంతకన్న జూటా మాట ఉంటదా అని ఎద్దేవా చేశారు.. పైసలన్నీ మేం ఇస్తున్నమని అంటున్నరు. ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పది వేల రూపాయలు ఇస్తున్నం ఒక్క రూపాయి ఉందా మీది, కేసీఆర్ కిట్ లో ఒక్క పైసా ఉందా మీది. అన్నీ అబద్దాలు.

ఈ పార్టీలు తెలంగాణకు హని చేస్తున్నయి. కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని కేసు వేస్తడు. బీజేపీ వాడు కాళేశ్వరం ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తడు. మిషన్ భగీరథ పనులు ఆపాలని, ఎంక్వైరీ చేయాలని ఉత్తరం రాస్తరు. మీరుఏమీ చేయరు. చేసే టీఆర్ఎస్ పార్టీని అడ్డుకుంటారన్నారు… టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన ప్రకృతి లాంటి పార్టీ. జాతీయ పార్టీలు వికృత పార్టీలు. పనులు ఆగాలి. ప్రజలకు టీఆర్ఎస్ మీద కోపం పెరగాలని కుట్రలు చేస్తున్నరు. టీఆర్ఎస్అంటేనే తెలంగాణ జాతి పార్టీ. ఇంటి పార్టీ. జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేసిందే తప్ప మేలు చేసిందేమి లేదన్నారు..వడ్లు కొనమంటే, వడ్లు కొనమని ఇబ్బంది పెడుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వమే 3 వేల కోట్ల నష్టం బరిస్తూ వడ్లు కొంటున్నమని చెప్పారు.

రోజు ఢిల్లీ నుండి వచ్చి ప్రజలపై దండయాత్ర చేస్తున్నరు. కాంగ్రెస్- బీజేపీలు ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కుట్రలు చేస్తున్నరు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజులు మంజూరు చేస్తే, ఒక్కటి ఇవ్వలే. తెలంగాణ రాకపోతే కేసీఆర్ సీఎంగా లేకపోతే సంగారెడ్డి జిల్లా కు వైద్య కళాశాల వచ్చేదా… స్వరాష్ట్రం లో మనం లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకుంటే బసవేశ్వర ఎత్తిపోతల పథకం అవుతుండేనా…ఒక సారి ఆలోచించాలన్నారు.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పని చేసే పార్టీ. ఈ జాతీయపార్టీలు తెలంగాణకు హని చేస్తున్నాయి. తెలంగాణకు పని చేసే పార్టీలు ఉండాలా…. హాని చేసే పార్టీ వైపు ఉండాల ఆలోచించాలన్నారు

 టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ డి సి ఎంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్

కాంగ్రెస్ , బిజేపీ నాయకులు టి ఆర్ ఎస్ పార్టీ లో చేరికలు..

హైదరాబాద్ లో బుధవారం ఉదయం ఆందోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సినియర్ నాయకుల, మాజీ డీసిఎంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్, డాకుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిజెపికి చెందిన సీనియర్ నాయకులు నాగరాజు ఎంపీటీలు, ఇతర వారి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో, మంత్రి హరీశ్  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News