Tuesday, April 30, 2024

హ్యాట్రిక్ సిఎం కెసిఆరే: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణకు హ్యాట్రిక్ సిఎం కెసిఆరేనని తెలంగాణ ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని రూ. 63 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటి టవన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణకు జన్మనిచ్చింది సిద్దిపేట గడ్గనేనన్నారు. ఈ ప్రాంత ప్రజల దీవెనలతోనే సిఎం కెసిఆర్ ఉద్యమించి తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. కెసిఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి ఓరవడి మొదలైందన్నారు . నేడు మంత్రి హరీశ్ రావు అదే బాటలో ముందకు సాగుతూ రాష్ట్రం అబ్బురపరిచేలా అభివృద్ధిని కొనసాగిస్తున్నారన్నారు. సిద్దిపేట ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చడానికి కెసిఆర్ నాడు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వేయించి ఇర్కోడ్ గుట్టపై ఉన్న ట్యాంక్‌ల వరకు నీటిని తరలించి గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికి తాగునీరు అందించేవారన్నారు.

నేడు అదే స్ఫూర్తితో మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని కేంద్రం కాఫీ కొట్టి హర్ ఘర్ జల్ పేరుతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. 1988 లోనే కెసిఆర్ సిద్దిపేటలో 10 వేల మొక్కలు నాటి హరిత హార కార్యక్రమాన్ని చేపట్టారని నేడు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందన్నారు. 7.7 శాతం పర్యావరణం పెరిగి దేశంలోనే తెలంగాణ అగ్రగామి స్థానంలో నిలిచిందన్నారు. అలాగే దళితులు ఆర్థికంగా ఎదగాలన్న లక్షంతో కెసిఆర్ ఆనాటి కాలంలో దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని నేడు అదే స్ఫూర్తితో దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటైతే పాలింటే సత్తా ఉందా అని కొత్త మంది ఆవహేళనగా మాట్లాడరని వారికి అభివృద్ధితోనే గుణపాఠం చెబుతున్నామన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటి ఎగుమతులు 56 వేల కోట్లు ఉండేవని ఈ సంవత్సరాల పాలనలో 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగిందన్నారు.

అలాగే 3 లక్షల 23 వేల ఐటి ఉద్యోగాలను 9 లక్షల 5 వేలకు పెంచామన్నారు. దేశంలో 142 కోట్ల జనాభా ఉంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 59 లక్షల మాత్రమేనన్నారు. అదే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఆరున్నర లక్షలని అన్నారు. ఏ రంగంలో చూసిన తెలంగాణ కెసిఆర్ పాలనలో దేశానికే ఆగ్ర గామిగా నిలుస్తూ వస్తుందన్నారు. ప్రైవేట్ రంగంలో సైతం ఉద్యోగాల సంఖ్యను పెంచే దిశగా పరిశ్రమలను, ఐటి హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిద్దిపేట ఐటి హబ్ విస్తరణ చేపడతామన్నారు. అలాగే ఐటి టవర్‌లో టాస్క్‌ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి దిశగా శిక్షణ అందిస్తామన్నారు.
నాటి నినాదాలను నిజం చేసింది సిఎం కెసిఆరే…
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటే నినాదాల హామీలు మాత్రమే ఉండేవని నాటి నినాదాలను నేడు నిజం చేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొంత మంది ఎన్నో అనుమానాలను సృష్టించారని వారి అనుమానాలను పటాపంచలు చేసి సిఎం కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిరంతరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సాద్యమేనేనా అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి మాట్లాడరని నేడు నిరంతరం అందుతున్న నాణ్యమైన విద్యుత్‌ను చూసి ఆశ్యర్య పోతున్నారన్నారు. తెలంగాణ జాతీ ఖ్యాతీని ఆకాశమంతా ఎత్తుకు ఎత్తి చూపిన గోప్ప నాయకుడు సిద్దిపేట బిడ్డ కెసిఆరే అన్నారు. నమ్మిన సిద్దాంతాలను నిజం చేసి పట్టువదలని విక్రమార్కుడు కెసిఆర్ అని కొనియాడారు. మంత్రి కెటిఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలను ఓప్పించి తెలంగాణకు తీసుకువస్తున్నారని దీంతో ఐటి రంగ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.

తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల ఐటి ఉద్యోగులు కెటిఆర్ లాంటి ఐటి శాఖ మంత్రి తమ రాష్ట్రానికి ఉంటే బాగుంటుందని ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడంతోనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. అస్సాంలో కరంట్ ఇవ్వలేమని అక్కడి పాలకులు చేతులు ఎత్తేశారని, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉందని అదే సిఎం కెసిఆర్ పాలనలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఇదే కెసిఆర్ పాలనకు నిదర్శనమన్నారు. కెసిఆర్‌ను తిట్టిన నోరులే నేడు అభివృద్ధి చూసి మెచ్చుకుంటున్నాయన్నారు. సిద్దిపేటలో ఐటి టవర్ ఏర్పాటుకు సహకరించిన సిఎం కెసిఆర్, కెటిఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పరిశ్రమ శాఖ ప్రతినిధులతో పాటు ఐటి కంపెనీల ప్రతినిధులకు మంత్రుల చేతుల మీదుగా సన్మానించారు.

ఈసందర్బంగా పర్యావరణానికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వొడితల సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ , యాదవరెడ్డి, టిఎస్ ఐపాస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, సాయిచంద్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, పరిశ్రమల శాఖ ఎండి, సెక్రటరీలు నర్సింహ్మారెడ్డి,జయేశ్ రంజన్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News