Friday, June 9, 2023

కెసిఆర్ పథకం అందని ఇల్లు లేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదన్నట్లు తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇల్లు ఇండదు అనేది అక్షర సత్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం 10 గంటలకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన బహిరంగ సభలో పాల్గొనడానికి హుస్నాబాద్ విచ్చేసిన మంత్రి కెటిఆర్‌ను స్ధానిక ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ రమణలతో కలిసి ఘన స్వాగతం పలికారు.

Also Read: తొలిసారి గర్భస్థ శిశువుకు బ్రెయిన్ సర్జరీ!

హుస్నాబాద్ పట్టణంలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, 2 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించిన డిగ్రి కాలేజ్ , 1 కోటి రూపాయలతో నిర్మించిన ఎస్టీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ , 9,86 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. పట్టణంలో 2 కోట్లతో నిర్మించిన టిటిసి కళాశాల బిల్డిండ్, 13 లక్షలతో బస్తీ దవాఖానను, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తూ మున్సిపాలిటీ నిదులతో ప్రజలకు మేలు కలాగాలన్నారు. పన్నుల వసూలుతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చాలని మున్సిపల్ అదికారులను అదేశించారు. అనంతరం పట్టణంలోని డిపో గ్రౌండ్ ను ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

Also Read: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!

ఈ సందర్భంగా మాట్లాడుతూ…. హుస్నాబాద్ తలపై గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రాంత ప్రజలకు కల్పవల్లిగా నిండుకుండలా మారబోతుందన్నారు. స్ధానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సామ్యుడని అభివృద్ది విషయంలో నిరంతరం శ్రమించే హార్డ్ వర్కర్‌గా అభివర్ణించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సతీష్ కుమార్ లాంటి నాయకుడు ఉండడం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రదాని మోడీ అధికారంలోకి రాకముందు బడాబాబులు దోచుకున్న నల్లదనం తీసుకొచ్చి జన్ దన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి 15 లక్షలు జమ చేస్తారని గొప్పలు చెప్పి ప్రస్తుతం తెల్ల మొఖం వేశారని మండిపడ్డారు. బిజెపి నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్ర అద్యక్ష పదవిలో ఉన్న బండి సంజయ్ కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకురాకపోగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్న విమర్శించడమే పనిగా బిజెపి నాయకుల శైలి ఉందని ఆరోపించారు.

Also Read: ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు!

గత ఎన్నికల్లో సిలిండర్ దర చూసి బిజెపికి ఓటు వేయాలని చెప్పిన మోడీ ప్రస్తుతం అదే సిలిండర్ ధరను 1200 కు పెంచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆపర భగీరధుడు వలే ప్రాజెక్టులను పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ కేవలం బారత రాష్ట్ర సమితి కాదని బారత రైతు సమితిగా పేర్కోన్నారు. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించినప్పటికీ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకుండా మరోకసారి అవకాశం ఇవ్వాలని టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు పన్నిన రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీని కేంద్రంతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు.

Also Read: రష్యా ప్రతినిధిపై పిడిగుద్దులు గుద్దిన ఉక్రెయిన్ ఎంపీ!

అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ…. కరువు ప్రాంతానికి నీరు అందించి గోదావరి, కృష్ణ జలాలను తెచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.బిజేపి, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెలుతున్న బిఆర్‌ఎస్ పార్టీని చిన్న చూపులు చూస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు వెన్నుముకగా ఉంటున్న పార్టీ బిఆర్‌ఎస్ అన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీని రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరు శ్రమించాలని తెలిపారు.

Also Read: ఎన్‌సిపి అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ

ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ…. హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్దికి సీఎం కేసీఆర్‌నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలు ప్రాజెక్టును అడ్డుకునే దిశగా గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్లారని కానీ ప్రజల ఆకాంక్ష మేరకు రైతులకు క్షేమం కోరకు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తారని త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ప్రాంతంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానున్నదని తద్వారా 1 లక్ష ఏడు వేల ఎకరాలకు సాగునీరు హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు. స్వచ్చ సర్వేక్షన్‌లో భాగంగా హుస్నాబాద్ పట్టణానికి వరుసగా రెండు సార్లు అవార్డులు రావడం హుస్నాబాద్ అభివృద్దికి నిదర్శనమన్నారు. వేగవంతంగా అభివృద్ది అవుతున్న పట్టణం మన హుస్నాబాద్ అని వెల్లడించారు.

Also Read: ఎవెన్యూ ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యత: మంత్రి హరీశ్‌రావు

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ బాబు, కరీంనగర్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు జివి రామకృష్ణారావు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కర్ర శ్రీహరి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకట్, వైస్ చైర్మన్ అయిలేని అనిత శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, జడ్పీటీసీ భూక్య మంగ శ్రీనివాస్, ఎఎంసీ చైర్మన్ ఎడబోయిన రజని తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రజిత కృష్ణమాచారి, బిఆర్‌ఎస్ మండల అద్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పెసరు సాంబరాజు, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, పలు మండలాల అద్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News