Friday, April 26, 2024

ఎవెన్యూ ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యత: మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఎవెన్యూ ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట శివారు తేజోవనం అర్బన్ ఫారెస్ట్ ఫార్కు, మర్పడగలో సెంట్రల్ – మెగా నర్సరీ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ హరిత నిధి నర్సీరీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. నాటి ఎమ్మెల్యే నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసి నేటి హరిత నిధి ఏర్పాటుకు వేదికగా సిద్దిపేట ఆదర్శంగా నిలించిందన్నారు.

50 లక్షల మొక్క్ల సామర్ధంతో సెంట్రల్ నర్సరీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మూడేళ్ల పేరిట రూ. 5 కోట్ల 85 లక్షల నిధి కేటాయింపు చేసుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు , పట్టణ ప్రాంతాలకు అవసరమైన పండ్లు, పూల బ్యూటిషికేషన్ మొక్కలు పెంచి ఈ ప్రాంతం నుంచి వేరే దగ్గరకు పోకుండా ఇక్కడే లభించేలా ఈ మెగా నర్సరీ నిర్వహణ ఉండాలని ఆటవీశాఖ అధికారులను ఆదేశించారు. తేజోవనం అర్బన్ పార్కులో నర్సరీలో పడిపోయిన ఆకులతో వర్మి, కంపోస్టు తయారు చేయాలని సూచించారు.

సిద్దిపేట జిల్లా హరిత నిధి 50 లక్షల మొక్కల సామర్ధ్యం కలిగి 5 కోట్ల 85 లోలతో మూడేళ్లకు సరిపోయే సెంట్రల్ నర్సరీ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. చింతమడక అర్బన్ పార్కు, కల్పన వనం ,అర్బన్ పార్కు అభివృద్ది అంశాలపై ఆటవీ అధికారులు వివరించారు. అనంతరం ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఫోటో సెషన్ తిలకించి పలు సలహాలు, సూచనలు చేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, రాజన్న సర్కీల్ సీసీఎఫ్ -ఐఎఫ్‌ఎస్ సైదులు, జిల్లా ఆటవీశాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్, సిద్దిపేట ఆటవీ క్షేత్రాధికారి సయ్యద్ ఇక్రముద్దీన్ ఆటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News