హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం వల్ల ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందుల గురించి పిర్యాదులు చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించడం జరిగింది . ప్రజలు పిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్‌లను.. టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించడం జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లేలా అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలపారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు పోవడానికి మ్యాన్ హోల్‌లు ఉండేలా చూసుకోవాలని.. ప్రమాదాలు జరగకుండా అక్కడ జిహెచ్ఎంసి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి (Ponnam Prabhakar) సూచించారు.
విద్యుత్ స్తంభాల, విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్‌ల రూపంలో సందేశాలు పంపాలని ఆదేశించారు. తీవ్రత అధికంగా ఉన్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించి, తాగునీటి సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా మంచి నీటి నాణ్యతను పరీక్షించాలలని పేర్కొన్నారు. ఎక్కడ తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. బస్తీలు.. లోతట్టు ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగర ప్రజలు ఇలాంటి పరిస్థితులలో మ్యాన్ హోల్ మూతలు తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. హైడ్రా, జిహెచ్ఎంసి, పోలీసు, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయాలి అని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Also Read : కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం : కడియం