Thursday, April 25, 2024

కవితమ్మా ధైర్యంగా ఉండండి: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ దందా కేసులో నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఉదయం 10.30గంటలకు ఈడి విచారణకు హాజరైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కవితకు తమ మద్దతు తెలుపుతూ బిజెపి, ప్రధాని మోడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయని, అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు.

కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులా?: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కవితపై జరుగుతున్న ఈడీ దర్యాప్తును దేశం యావత్ గమనిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద కేసులు అవుతున్నాయో చూస్తున్నారన్నారు. బిజెపి వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని, వారు సచ్ఛీలురా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించకపోతే ఏ కేసులు ఉండవని ఆయన వివరించారు. కేవలం ప్రతిపక్ష నాయకులపై మాత్రమే ఎందుకు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News