Wednesday, May 8, 2024

ఉమర్‌ ఫరూక్‌కు గృహ నిర్బంధం నుంచి విముక్తి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ వేర్పాటువాది , హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ గృహనిర్బంధం నుంచి శుక్రవారం విడుదలయ్యారు. ఆయన నాలుగేళ్లుగా గృహనిర్బంధంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం 2019ఆగస్ట్ 5న రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ సిఎంలతోపాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది. విముక్తి కోసం ఫరూక్ ఇటీవల లడఖ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో పోలీస్ అధికారులు గురువారం ఆయన నివాసానికి వెళ్లి విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News