మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్న ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సుమారుగా 116 దేశాల నుంచి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా దేశాలకు చెందిన సుందరీమణులు తమ దేశానికి జాతీయ జెండాలను చేతపట్టుకొని స్టేజీపైకి వచ్చారు. మిస్ ఇండియాకు నందినిగుప్తా జాతీయ జెండా పట్టుకొని స్టేజీ మీదకు వచ్చినప్పుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమ్రోగింది.
చీరకట్టుతో ర్యాంపు పైకి వచ్చిన మిస్ నేపాళి అందరినీ ఆకర్శించింది. నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా ఈ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1వ తేదీన హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరుగనుండగా 116 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇండో,- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం విశేషం.