Wednesday, October 9, 2024

ప్రసాదం అపవిత్రం చేసిన వాళ్లు తిరుమలకు ఎందుకు? : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. “టిటిడి ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేనపుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారు.. ఇది సరైందేనా?”అని పరోక్షంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని, ఇలాంటి పాపిష్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా? అని చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గులేకుండా మళ్లీ తిరుమల దర్శనానికి వెళ్లడం ఏమిటన్నారు.

హిందూ ధర్మాన్ని గౌరవించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని, దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ మంచి మాట చెప్పారని, ఒక సనాతన ధర్మ రక్షణకు ఓ హిందూ బోర్డ్ అవసరమని చెప్పారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దేవాలయ, ఆలయ భూములను కాపాడాలని కోరారు. తిరుమలను ఎంతో పవిత్రంగా ఉంచాలని కోరారు. భారత్ నుంచి మాత్రమే కాదని, వివిధ దేశాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తారని చెప్పారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వాళ్లు తిరుమలకు వెళ్లడం సరైంది కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News