Wednesday, May 1, 2024

ఎంఎల్‌సి కవితకు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవితకు ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవితకు మధ్యంతర బెయిల్‌ను ఇడి వ్యతిరేకించింది. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని కోర్టుకు ఇడి తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. తన కుమారుడి పరీక్షల దృష్టా బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసింది.  మరోవైపు కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి సిబిఐ పొందింది. సిబిఐకి అనుమతి ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. కవిత పిటిషన్‌పై మార్చి 10న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేయనుంది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న కోర్టు విచారణ చేయనుంది. ఢిల్లీ మద్యం కేసలో మార్చి 26 నుంచి కవిత తిహార్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News