Sunday, April 28, 2024

ఆస్ట్రేలియాలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -
MLC Kavitha Birthday Celebrations in Australia
కాన్భెర్రాలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్భెర్రా, బ్రిస్భేన్, ఆడిలైడ్ పట్టణాల్లో టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ మాట్లాడుతూ కవిత ఆశీస్సులతో ఆస్ట్రేలియాలో టిఆర్‌ఎస్ కార్యవర్గాన్ని అన్ని నగరాల్లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గం ఖండాంతరాలకు వ్యాప్తి చెందడంతో ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తమకు ఈ అవకాశం కల్పించిన కవితకు హృదయ పూర్వక కృతజ్ఞతలను ఆయన తెలియచేశారు. తెలంగాణ జాగృతి ద్వారా కవితక్క అందిస్తున్న విశేష సేవలను ఆయన కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కవితక్క చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ గిరి, రాపోలు, సాయిరాం ఉప్పు, ప్రవీణ్ పిన్నమ, శ్రీకాంత్‌రెడ్డి, రవి యాదవ్ తదితరులు పలు పట్టణాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎసిటి ఇన్‌చార్జీ రవి సాయల ఆధ్వర్యంలో కాన్భెర్రాలో ప్రత్యేక పూజలతో పాటే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News