Monday, May 6, 2024

నన్ను అలా అనొద్దు… నేను తెలంగాణ ఆడబిడ్డనే రేవంత్: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతం గురించి సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. కవిత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి విగ్రహం కవితలాగా ఉందని సిఎం రేవంత్ అనడం మంచిది కాదని, తాను తెలంగాణ ఆడబిడ్డనే కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి సిఎం రేవంత్ మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో న్యాయ విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, విద్యుత్ సంస్థల్లో ఎపి వాళ్లను డైరెక్టర్‌లుగా  నియమించారని, తెలంగాణ అసెంబ్లీకి ఎపి సలహాదారులు ఎందుకు అని కవిత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News