Thursday, May 2, 2024

ముగిసిన నామినేషన్ల ఘట్టం

- Advertisement -
- Advertisement -

MLC Nomination Process is Completed in Telangana

హైదరాబాద్: మహబూబ్‌నగర్-‌రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. గత నెల 16న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ మంగవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 51 మంది అభ్యర్థులు 89 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో నిర్దేశిత సమయం మధ్యాహ్నం 3 గంటల లోపు కూలైన్లలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేశారు. అనంతరం వారి నుంచి నామినేషన్లను స్వీకరించారు. ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 110 మంది అభ్యర్థులు 179 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నేడు నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26న తుది గడువు విధించారు.

సురభి వాణిదేవి తరుపున హోంమంత్రి, మేయర్ నామినేషన్ దాఖలు…

టిఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మంగళవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరపున హోం మంత్రి మహమూద్ అలీ, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు అందజేశారు. అదేవిధంగా టిటిడిపి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా చివరిరోజున బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు సైతం మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

మెయిన్ హాల్‌లో నామినేషన్ స్క్రూట్నీ… 

జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో ఉన్న మెయిన్ హాల్‌లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా తెలిపారు. అత్యధిక సంఖ్యలో 110 మంది నామినేషన్లను దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ముందుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనే నామినేషన్ పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని భావించామని, అయితే 110 అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్లు పెద్ద సంఖ్యలో హాజరు కానుండడంతో, కోవిడ్ నిబంధనల దృష్యా 7వ అంతస్తులోని మెయిన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టంశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News