Sunday, April 28, 2024

మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Comments On Buddha Vanam Project

హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు చేయించారన్నారు. కర్నాటకపై ఉన్న ప్రేమ, తెలంగాణపై ప్రధానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. బెంగళూరుకు మూడు రోజుల్లో ప్రధాని మోడీ సహాయం ప్రకటించారని, హైదరాబాద్ విషయంలో ఇప్పటివరకు ఎందుకు స్పందించడంలేదన్నారు. ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ రాసినా ఫలితం లేదన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే స్వయంగా వెళ్లి ప్రధాని నిధులు విడుదల చేశారని, హైదరాబాద్‌లో విషయంలో వివక్ష ఎందుకు అని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రి, ఎంపిలు ఉండి తెలంగాణ రూపాయి తీసుకరాలేదని మండిపడ్డారు. వరద బాధితుల కోసం కేంద్రాన్ని రూ.1300 కోట్లు అడిగితే నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. మన హైదరాబాద్-మన బిజెపి అంటూ నినాదాలు చేస్తున్నారని, హైదరాబాద్‌కు ఏం చేశారని, మన హైదరాబాద్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు ఉన్నప్పుడు నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, నగరంలో వెయ్యి మందికి ఒక టాయిలెట్ నిర్మాణం ఉందని, కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టి అవసరమైతే మరో రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి, ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ప్రాపగండానికి ప్రజలు లోనుకావొద్దన్నారు. 1908లో హైదరాబాద్ జలమయం అయ్యిందని చరిత్ర చెబుతుందని, 1916లో మరోసారి మూసీకి వరదలు వచ్చాయని, ఇప్పుడు 2020లో అత్యధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయని, దశాబ్దాలు పాటు మానవ తప్పిదాలు, చెరువుల కబ్జాల వల్ల ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు అప్రమత్తంగా ఉన్నామని, మా అప్రమత్తత వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని వివారించగలిగామన్నారు. 800 మందితో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. కుంభ వృష్టి వర్షం కురుస్తున్న తనతో పాటు ప్రజాప్రతినిధులంతా ప్రజల్లో ఉన్నారన్నారు. హైదరాబాద్ 4 లక్షల 30 వేల కుటుంబాలకు తక్షణ సాయం కింద పది వేల రూపాయలు ఇచ్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News