Thursday, May 2, 2024

రష్యా బంధంతో ఇంధన విజయం: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi hails India-Russia energy partnership

న్యూఢిల్లీ : భారత్ రష్యా బంధం కాలపరీక్షకు, పలు సవాళ్లకు నిలిచి సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన విఫణిలో ఇరు దేశాల బంధం కీలకమైనదని , ఈ రంగంలో సుస్థిరతకు ఇరుదేశాల సత్సంబంధాలు దోహదం చేస్తాయని ప్రధాని చెప్పారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఇఇఎఫ్) ప్లీనరీ సెషన్ రష్యా నగరం వ్లాదివోస్తక్‌లో శుక్రవారం జరిగింది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. పలు అంశాలలో రష్యా భారత్‌లు కలిసికట్టుగా వ్యవహరిచాయని, కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడంలో , తరువాతి దశలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇరు దేశాల సంయుక్త కార్యాచరణ అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. రష్యా తూర్పు దేశాల పట్ల అనుసరిస్తున్న సానుకూల ధోరణి విషయంలో తాను ప్రధానంగా దేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచనలను అభినందిస్తానని చెప్పారు. ఆయన విజన్‌ను నిజం చేసేందుకు రష్యాతో విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఎల్లవేళలా భారతదేశం వ్యవహరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. భారత్‌లో దండిగా ప్రతిభ ఉంది. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతా అపార సహజవనరులు ఉన్నాయి. భారతీయ ప్రతిభను వినియోగించుకుంటే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధికి వీలేర్పడుతుందని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News