Sunday, April 28, 2024

ఆరు రోజుల పోలీసు కస్టడీకి మహ్మద్ జుబేర్‌

- Advertisement -
- Advertisement -

Zubair

బెయిల్ పిటిషన్‌ ను విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: హత్య బెదిరింపులను ఉటంకిస్తూ, ఫ్యాక్ట్-చెకర్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, యూపీలోని సీతాపూర్‌లో తనపై వేసిన ట్వీట్‌పై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, “అత్యవసరంగా” బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొంతమంది మత పెద్దలను “ద్వేషపూరిత ప్రేరేపకులు” అని పేర్కొన్నారు.ఐపిసి సెక్షన్ 295 A (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం) , ఐటి చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపిన కేసులో సీతాపూర్ కోర్టు జుబేర్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీకి పంపిన రోజున ఈ చర్య జరిగింది.

“కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత, జుబేర్‌ను సీతాపూర్ జిల్లా జైలుకు పంపారు. రేపటి నుంచి (శుక్రవారం) పోలీసు కస్టడీ ప్రారంభమవుతుంది’’ అని సిటీ (సీతాపూర్) సర్కిల్ ఆఫీసర్ పీయూష్ కుమార్ సింగ్ తెలిపారు.

“జుబేర్‌ ట్విట్ చేయడానికి ఉపయోగించిన పరికరాన్ని పొందేందుకు , సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను అప్‌లోడ్ చేసినందుకు అతని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునేందుకు మేము అతనిని పోలీసు కస్టడీకి కోరాము ” అని కేసు నమోదు చేయబడిన ఖైరాబాద్ (సీతాపూర్) స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ సింగ్ తెలిపారు.

జుబేర్‌కు ముందస్తు బెయిల్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిందని, దీంతో ఈ కేసులో అతడిని అరెస్టు చేసినట్లు న్యాయవాది తెలిపారు. “నేను అతనికి అత్యవసరంగా బెయిల్ కోరుతున్నాను. అతనికి హత్య బెదిరింపులు ఉన్నాయి. మరోవైపు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వ్యక్తులు చాలా ఆత్రుతగా ఉన్నారు, వారు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారని ఇంటర్నెట్‌లో తెలిపారు, ”అని అతడి న్యాయవాది గోన్సాల్వ్స్ చెప్పారు.

జుబైర్‌పై సీతాపూర్ కేసు జూన్ 1న నమోదైంది. మేలో చేసిన ట్వీట్‌లో జుబైర్ భజరంగ్ మునిని “ద్వేషపూరిత ప్రేరేపకుడు”గా పేర్కొన్నాడని హిందూ లయన్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు భగవాన్ శరణ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, జుబేర్ ట్విట్టర్‌లో యతి నర్సింహానంద్,  స్వామి ఆనంద్ స్వరూప్‌లను కూడా అవమానించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News