Thursday, October 10, 2024

డిసెంబర్‌లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

ఐఫా అవార్డ్స్‌కు హాజరు అయిన స్టార్ హీరో బాలయ్య బాబు, తన వారసుడు మోక్షజ్ఞ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశా రు. ఇంతకీ బాలయ్య ఏం మాట్లాడారంటే.. ‘ఐఫా సెలబ్రేషన్స్‌లో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సదరు యాంకర్ ‘మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది? అని ప్రశ్నించగా ’మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్‌లో లాంచ్ చే స్తున్నాం’ అని బాలయ్య చెప్పారు. కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మో క్షజ్ఞ మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుంది. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News