Saturday, April 27, 2024

పిల్లలు, గర్భిణీ మహిళలపై మంక్సీపాక్స్ ప్రభావం

- Advertisement -
- Advertisement -

monkeypox effect on children and pregnant womens

సరైనా రోగ నిర్దారణ కోసం వైద్యులను సంప్రదించాలి
జ్వరం, వణుకు, తల,కండరాల నొప్పి, ఆలసట లక్షణాలు
బహిర్గం అయితే ఐదు రోజుల నుంచి మూడు వారాల వరకు లక్షణాలుంటాయి.
కుటుంబంలో ఎవరికి సోకిన చికిత్స తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్: నగరంలో మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులతో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయితే అనవసరంగా ఆందోళన చెందడానికి ముందు ఈ కొత్తవైరస్ వ్యాప్తి గుర్తించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు తెలుసుకోవడం ప్రజలకు ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మంక్సీ ఫాక్స్ అనేది హ్యాండ్ పుట్ అండ్ మౌత్ డిసీజ్, మీజిల్స్, చికెన్‌పాక్స్ వంటి ఇతర వైరస్‌లలో ఉండే సాధారణమైన అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. వ్యాధి బహిర్గతం అయిన తరువాత లక్షణాలు స్పష్టంగా కనిపించడానికి ఐదు రోజుల నుంచి 3 వారాలు వరకు పట్టవచ్చని డాక్టర్ అవష్ పాణి చెబుతున్నారు. పిల్లలు ఈవైరస్ బారిన పడే అవకాశముందని అయినప్పటికి దాదాపు పిల్లలలో ఈవ్యాధి ప్రమాదం తక్కువే దీనిపై తల్లిదండ్రులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఈవ్యాధి సోకితే జ్వరం, వణుకు, చలి, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, ఆలసట, శోషరస గ్రంధులలో వాపు, ముఖం మీద, నోటిలో, శరీరంలోని ఇతర భాగాలపై కనిపించే దద్దుర్లు, బొబ్బలు. దుద్దుర్లు ఏర్పడటం అత్యంత ముఖ్యమైన లక్షణం. మీజిల్స్, చికెన్‌ఫాక్స్ మాదిరిగా, ఇందులో దద్దుర్లు సన్నని గడ్డలుగా మారుతాయి. అవి ఎర్రగా మారి, ద్రవం, చీముతో నిండి పెచ్చులుగా మారి చివరికి రాలిపోతాయి. దాని తరువాత అవే నయం అవుతాయి వెల్లడిస్తుంచారు.

మంక్సీ వ్యాధి వ్యాపించడం: దద్దుర్లు స్కాట్, శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా సోకిన వ్యక్తిని తాకడం, కౌగిలించుకోవడం, హత్తుకోవడం ఎక్కువ సేపు వ్యాధి సోకిన వారిని అంటిపెట్టుకుని ఉండంటం వ్యాధి సోకిన వ్యక్తి గతంలో తాకిన పరుపు, దుస్తులు, వస్తువులు వంటి కలుషితమైన వస్తువులు తాకడం తల్లి మాయ ద్వారా గర్భంలోని పిండానికి చేరడం కలుషితమైన మాంసాన్ని తినడం ద్వారా, వ్యాధి సోకిన జంతువు రక్కడం, కరవడం ద్వారా వ్యాధి సోకిన వారు వైరస్‌వ్యాధి సోకినప్పుడు నుంచి చర్మంపై దద్దుర్లు నయం అయ్యే వరకు వైరస్‌ను వ్యాప్తి చేస్తూనే ఉంటారు. గర్భిణీలు, పిల్లలో మంకీపాక్స్ ప్రమాదస్దాయి. కోవిడ్‌తో పోలిస్తే , మంకీఫాక్స్ మరొక వ్యక్తికి వ్యాపించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎవరు అంతగా భయపడాల్సిన అవసరంలేదు. ఇది ఇప్పటికి చాలా అరుదు. దీనిని తక్కువ ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పవచ్చు చాలా మంది వ్యక్తులు స్వయంగా స్వస్ధత పొందుతారని అంటారు. కానీ అసాధారణమైన సందర్భాల్లో వ్యాధితో న్యుమోనియా, కంటి, మెదడు ఇన్పెక్షన్లు సంభవించవచ్చు.

తల్లి నుండి గర్భంలో ఉన్న పిండంలకు వ్యాపిస్తుంది.
గర్భిణీలు, 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
సాధారణ జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తిచెందకుండా తరచుగా చేతులు కడుక్కోవడం ః వైరస్ వ్యాప్తి చెందకముందే దానిని నియంత్రించడంలో సహాయపడటానికి, పిల్లలు మంచి పరిశుభ్రత పద్దతులు పాటించడం చాలా అవసరం. గాఢతలేని సబ్బు, అల్కహాల్ ఆదారిత శానిటైజర్ చేతులు కడుక్కోవడంతో అనేక ఇన్పెక్షన్‌లను నివారించవచ్చు. అనుమానిత, ధృవీకరించబడిన కేసులతో సన్నిహిత సంబంధాన్ని నివారంచాలి. ఎవరికైనా మంకీ ఫాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయినట్లయితే వారితో సన్నాహిత సంబంధం నివారించడం సురక్షితం. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు వ్యాధి సోకిన వ్యక్తితో నేరుగా బౌతికంగా సంభాషించకూడదు. ఆవ్యక్తి ఉపయోగించే వస్తువులను తాకకూడదు. కుటుంబంలోని ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News