Tuesday, May 14, 2024

మూసీ మెరవాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రో డ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలుమారిపోతాయని, వా టికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని ఆయన ఆయా కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రం ట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యా రు.

ఇటీవల లండన్, దుబాయ్ ప ర్యటనలో సి ఎం అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్‌లోని పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధు లు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నే పథ్యంలోనే హైదరాబాద్ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారు లు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నా రు. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు సిఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్‌లతో పాటు హైదరాబాద్‌లోని మూసీ డెవలప్‌మెంట్‌కు అనుసరించాల్సిన ప్రా జెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజేంటెషన్‌ఇచ్చారు. సిఎంను కలిసిన వారిలో మెయిన్‌హార్ట్ గ్రూప్ సిఈఒ ఒమర్ షహజాద్, సురేష్ చంద్రతో పాటు ప్రతినిధి బృందం ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News