Monday, April 29, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. మరో తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పో స్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. కొత్త గా అనుమతిచ్చిన ఉద్యోగాల్లో 24 డిఎస్‌పి, 19 ఎం పిడిఒ, నాలుగు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంటెం డ్, మూడు డిప్యూటీ సూపరింటెంటెండ్ ఆఫ్ జైల్స్, మూడు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, మూడు డిప్యూటీ కలెక్టర్, రెండు జిల్లా పంచాయతీ అధికారి, ఒక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఒక జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. గతంలో 503 గ్రూప్ 1 పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది. త్వరగా గ్రూప్ -1కు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి)ని ఆదేశించింది.
అనుబంధ ప్రకటననా..? కొత్త నోటిఫికేషనా..?
2022 ఏప్రిల్ 26న వివిధ శాఖల్లోని 503 గ్రూప్ 1 పోస్టుల కోసం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారా..? లేక పాత నోటిఫికేషన్‌కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? అనే విషయంపై టిఎస్‌పిఎస్‌సి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రెండు సార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండు సార్లు రద్దయింది. 2022లో తెలంగాణలో 503 పోస్టులతో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా, ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. గత ఏడాది జనవరిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి అదే ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లనూ టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబరు 16న నిర్వహించిన పద్ధతిలోనే జూన్ 11న పరీక్ష జరపకపోవడం అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్లు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రిలిమ్స్ రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం టిఎస్‌పిఎస్‌సిని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News