Tuesday, May 7, 2024

రోహిత్ సేన అదరహో..

- Advertisement -
- Advertisement -

Mumbai indians won against Rajasthan royals

 

సూర్యకుమార్ మెరుపులు, చెలరేగిన బుమ్రా
రాజస్థాన్‌పై ముంబై ఘన విజయం

అబుదాబి: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ముంబై బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ రాయల్స్‌ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0)ను బౌల్ట్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6) కూడా పెవిలియన్ చేరాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన సంజు శాంసన్ కూడా నిరాశ పరిచాడు. శాంసన్ ఖాతా తెరవకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జోస్ బట్లర్ పోరాటం కొనసాగించాడు. అయితే అతనికి సహకారం అందించే వారు లేకుండా పోయారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 44 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మిగతావారిలో ఆర్చర్ (24) ఒక్కడే కాస్త రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో బుమ్రా 20 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, పాటిన్సన్‌కు రెండేసి వికెట్లు లభించాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైని సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 47 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (35), హార్దిక్ 30 (నాటౌట్) తమవంతు సహకారం అందించడంతో ముంబై భారీ స్కోరును సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News