Sunday, April 28, 2024

నవీన్ చంద్ర హీరోగా ‘ఎలెవెన్’

- Advertisement -
- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్‌గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఓ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎలెవెన్’ అంటే టైటిల్ ని ఖారారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది.

‘కలకలప్పు 2’, ‘వంద రాజవతాన్ వరువెన్’, ‘యాక్షన్’ చిత్రాలలో దర్శకుడు సుందర్ సి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ‘ఎలెవెన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. నవీన్ చంద్ర ‘శరభం’, ‘శివప్పు , ‘బ్రమ్మన్’ లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’, కార్తీక్ సుబ్బరాజ్’జిగర్తాండ డబుల్ ఎక్స్’లలో కీలక పాత్రలు పోహిస్తున్నారు నవీన్ చంద్ర.

‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.  డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.

‘ఎలెవెన్’ దర్శకుడు లోకేశ్ అజ్ల్స్ మాట్లాడుతూ ” మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే  ఫాస్ట్-పేస్డ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ప్రతిభావంతులైన నటీనటుల, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నిర్మాతలకు  ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ 23 నుంచి ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News