Sunday, April 28, 2024

మాజీ భార్యపై నవాజుద్దీన్ సిద్దిఖీ రూ. 100 కోట్ల పరువునష్టం దావా

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: తనను అప్రతిష్ట పాల్జేసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న తన మాజీ భార్య ఆలియా అలియాస్ జైనాబ్ సిద్దిఖి, తన సోదరుడు షంషుద్దీన్ సిద్దిఖిపై రూ. 100 కోట్ల పరువు నష్టాన్ని కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి బొంబాయి హైకోర్టులో దావా వేశారు. ఈ సిటిషన్‌పై విచారణ మార్చి 30న జస్టిస్ రియాజ్ చగ్లాకు చెందిన సింగిల్ బెంచ్ వద్ద జరిగే అవకాశం ఉంది.

తన మొదటి భార్యతో వేరుపడిన నవాజుద్దీన్ సిద్దిఖి ఆమె చేస్తున్న అసత్య ప్రకటన కారణంగా తన పరువుకు భంగం ఏర్పడుతోందని కోర్టుకు తెలిపారు. తన సోదరుడు కూడా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, వీరిద్దరూ తన పరువుకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేయకుండా శాశ్వతంగా కట్టడి చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. తన మాజీ భార్య, తన సోదరుడి నుంచి క్షమాపణ లేఖను కూడా ఆయన కోరారు. 2008లో షంషుద్దీన్‌ను తన మేనేజర్‌గా నియమించుకుని గుడ్డిగా ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను అతనికి లప్పగించానని నవాజుద్దీన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే. షంషుద్దీన్ తనను మోసం చేసి తన డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ మోసం గురించి తెలుసుకున్న తాను ప్రశ్నించగా తనకు వ్యతిరేకంగా తప్పుడు కేసు పెట్టవలసిందిగా తన భార్య ఆలియాను షంషుద్దీన్ ప్రేరేపించాడని నవాజుద్దీన్ తెలిపారు. ఆయా, షంషుద్దీన్ కలిసి తను నుంచి రూ. 21 కోట్లు మోసం చేశారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులను వాపసు చేయాలని తాను కోరగా తనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా చవకబారు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News