Tuesday, April 30, 2024

పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?

- Advertisement -
- Advertisement -

కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్‌ను కొంతమేర తొలగించామని ఎన్‌సిఇఆర్‌టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన వచ్చినా అది పునరుక్తి కాదు. కొన్ని పాఠ్యాంశాలను తొలగించడానికి కరోనా కారణమని చెప్పడం ఏవిధంగానూ సరికాదు. ముఖ్యంగా ఆ పాఠ్యాంశాలనే ఎందుకు తొలగించారో సంజాయిషీ చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. తొలగించిన పాఠ్యాంశాల జాబితా ఉన్న చిన్ని పుస్తకాన్ని గమనించినట్టయితే, విద్యార్థులపైన మోపిన భారం ఉద్దేశం స్పష్టమవుతోంది. పాఠ్యాంశాల తొలగింపు ఉద్దేశం, చరిత్రపైన వ్యాఖ్యానం అధికారంలో ఉన్నవారి ఆమోదం పొందినవే కనుక, దాని ఉద్దేశం సుస్పష్టం.

తొలగింపులు ఏకపక్షంగా జరిగాయని అనేక మంది ప్రముఖ చరిత్రకారులంటున్నారు. ఒకవేళ పాఠ్యాంశాలను తగ్గించినట్టయితే, దాన్ని పునర్నిర్మించాలి కానీ, శాశ్వతంగా నరికేయకూడదు. భారత దేశ చరిత్రపై పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాల్లో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో ఏమార్పులు లేవు. రెండవ భాగంలో 30 పేజీలను పూర్తిగా తొలగించారు. ఈ తొలగించినవన్నీ పదహారు, పదిహేడవ శతాబ్దాల రాజులు, వారి వృత్తాంతాలు; మొఘల్ న్యాయస్థానాల విశిష్టత. ఆ చిన్న పుస్తకంలోని ప్రతి పేజీలో “పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకంలో హేతుబద్ధ్దీకరించిన జాబితా” అని రాసి ఉంది. మొఘల్ చరిత్ర తన పూర్వపు వైభవాన్ని చరిత్రలో కోల్పోయేటట్టు చేయడం కోసమే ఒక చాప్టర్ అంతా తీసేశారు. మొఘల్ చరిత్ర ముస్లిం పరిపాలనలోనే శిఖరాయమానమైందని గతంలో అభివర్ణించారు. మొగల్ చరిత్ర ద్వారా ముస్లింల చరిత్ర గొప్పదనాన్ని తగ్గించకపోయినట్టయితే, దాన్ని తుడిచి వేయకపోయినట్టయితే కనీసం పక్కకు పెట్టాలన్నది వారి ఉద్దేశం.

చరిత్ర గురించి మిడిమిడి జ్ఞానం ఉన్న వారు కానీ, అసలు చరిత్ర గురించి తెలియని వారు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పదహారు, పదిహేడవ శతాబ్దాల కాలం అపారమైన రెండు సంస్కృతుల రూపాలుగా, ఆర్థిక రంగాలుగా, సామాజిక వర్గాలుగా ఉన్నాయన్నది వాస్తవం. హిందూ, జైన వ్యాపారులు అరబ్బు వ్యాపారులతో వాణిజ్యం నెరపడం వల్ల వాణిజ్య ఆర్థిక వ్యవస్థ చాలా సుసంపన్నమైంది. భూయజమానులు, వ్యాపారుల మధ్య అనుబంధం ఆర్థిక వ్యవస్థను ఆకట్టుకునేలా చేసింది. భారత, విదేశీ వాస్తు శైలి సమ్మిళితంతో అద్భుతమైన నిర్మాణాలు వెలిశాయి. చక్రవర్తి ఆస్థానాలు, సామంతుల ఆస్థానాలు కళాకృతుల తయారీ కేంద్రాలుగా తయారయ్యాయి. ఆనాటి జీవన పరిస్థితులను ప్రతిబింబించే సూక్ష్మ చిత్రాలు, అందంగా తయారు చేసిన లెక్కలేనన్ని పుస్తకాలు ఆరోజుల్లో లభించేవి. ఆ రోజుల్లో ‘లవ్ జిహాదీ’ లు లేవు. రాజపుత్ర స్త్రీలు, ముస్లిం పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. మొఘల్ సామ్రాజ్య పరిపాలనా వ్యవహారాల్లో కచ్‌వాహ్ రాజపుత్రులు ప్రధా న పాత్ర పోషించారు. వీళ్ళు ఎలా పరిపాలించారు, ఇతర పాలకులు ఎలా పరిపాలించారన్న విషయం నేటి భారతీయులు తెలుసుకోవద్దా?.

సూఫీ, భక్తి ఉద్యమాల సుసంపన్నం
ఆ కాలంలోనే హిందూ విశ్వాసాల్లో, ఆరాధనల్లో అపారంగా ప్రభావితం చేసే ఆలోచనలు మొదలయ్యాయి. మత అన్వేషణల్లో భక్తి ఉద్యమం హిందూ మతాన్ని సుసంపన్నం చేసింది. ఆ రోజుల్లోనే. యోగులు, సూఫీలు తమ తమ ఆలోచనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, ఆ ఆలోచనలను హిందీ సహా అనేక ప్రాంతీయ భాషల్లో నిక్షిప్తం చేశారు. వలస పాలనకు ముందు వివిధ రంగాల్లో మేధోపరమైన జీవితం అభివృద్ధి చెందింది. కృష్ణుడిపైన భక్తితో హిందూ, ముస్లింలు కూర్చిన అనేక పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. వైద్య శాస్త్రంలో, గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో చాలా అధ్యయనాలు జరిగడమే కాదు, జ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇవి విద్యా కేంద్రాలకు వ్యాపించడమే కాక, సంస్కృతిపైన ఒక బలమైన ముద్రవేశాయి. వీటన్నిటినీ చెరిపేయాలా? సామాజిక న్యాయంపైన భారత దేశం తన ప్రభావాన్ని చూపింది. బైట నుంచి వచ్చిన దిగువ కులాల వారిపైన కూడా ధర్మశాస్త్రాలు వర్తింప చేశారు.

ఆవరణ, అస్పృశ్యత ప్రభావం ఇతర మతాలపైన కూడా పడింది. ముస్లింలలో పాస్మండ, సిక్కుల్లో మజాహబిస్‌లను తక్కువ కులాల వారిగా పరిగణించారు. అల్లా దృష్టిలో అందరూ సమానమని ఇస్లాం బోధించినప్పటికీ, షరియత్ చట్టం సామాజిక దూరాన్ని అమల చేసింది. ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ, రెండు సహస్రాబ్దుల వరకు ఈ వర్గాల వారు ఆ విధానాలకు బాధితులయ్యారు. ఈ విషయాలన్నిటినీ ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించేశారు. ఈ వాస్తవాలకు బదులు అవకాశం ఉన్నప్పుడల్లా హిందువులను ముస్లింలే బాధించారని చెప్పడం పరిపాటైంది. ఆ ప్రకటనలేవీ వాస్తవాల ఆధారంగా లేవు.
మేధో వ్యతిరేక ఆధిపత్యవాదం
భారత దేశ చరిత్రను 1817లో రాసిన జేవ్‌‌సు మిల్ అనే వలసవాద రచయిత ఉద్దేశపూర్వకంగా ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించాడు. భారత దేశంలో వలసవాద రచనలకు ఇది మూలంగా ఆమోదించారు. వలసవాద జాతీయ చరిత్రకారుల్లో కొందరు దీన్ని అంగీకరించలేదు. మరి కొందరు ఇది సరైన సిద్ధాంతమని, తమ తాత్వికతకు పునాది అని, మత జాతీయవాదులు పాకిస్థాన్‌ను సృష్టించినట్టయితే, హిందూ రాష్ర్టం ఏర్పడవచ్చని భావించారు. దీనికి పాకిస్థాన్‌లో అధిక సంఖ్యాకులైన ముస్లింలు పాలకులవడం, భారత దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల పాలకులవడం అవసరం.

మెకాలే వారసులుగా వచ్చిన మతపరమైన జాతీయవాదుల వాదనలను, వారు రాసిన తప్పుడు చరిత్రను పరిశీలించి, హేతుబద్ధంగా ఆలోచించే వారు దాన్ని తిరస్కరించారు. ఈ మత జాతీయవాదులు హిందు, ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వలసవాద అధికారం నుంచి స్వీకరించిందే. ఈ పోరాటం చరిత్ర రచనలో కూడా ప్రతిబింబించింది. ‘అధిక సంఖ్యాక’ సిద్ధాంతం హిందూ పరిపాలనా, ముస్లిం పరిపాలనా అధిపత్యానికి దారితీసింది. చరిత్ర రచనలో కాని, ఇతర సామాజిక శాస్త్రాల రచనలో కాని అనుసరించే ఈ విధానం కానీ, కొన్ని భాగాలను తొలగించడం కానీ, ప్రమాదకరమైనవి గానే భావిస్తాం. పద్ధతుల మూలాలు భారతీయ మేధో రంగంలో ఎక్కడున్నాయో మనం అన్వేషించాలి. భారతీయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు చరిత్ర మూలమని అంటున్నారు. చరిత్రను అన్వేషించే పద్ధతులను పరిశీలించకుండా, విమర్శనాత్మకంగా విచారించకుండా రాసిన చరిత్రను ఈ శాస్త్రవేత్తలు నమ్మడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్ష్యాల ఆధారంగా రాసిన వృత్తిపరమైన చరిత్రకారులను ఈ శాస్త్రవేత్తలు వక్రీకరించిన చరిత్ర అని, వామపక్షవాదులు, మార్క్సిస్టులు తమ ఇష్టానుసారం రాసిందని కొట్టేస్తున్నారు. చరిత్రను విస్మరించి, ఊహాజనితాలను, కల్పితాలను వారు ఆనందంగా వల్లె వేస్తున్నారు.

చరిత్ర రచనా పద్ధతులు అనేవి శాస్త్రీయ పద్ధతులను, విశ్లేషణ నుంచి వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవడానికి వారు ఒక్క నిమిషం కూడా కేటాయించరు. ఎన్‌సిఇఆర్‌టి ఇతర అంశాల్లో కూడా ఇలాగే పాఠ్యాంశాలను తొలగిస్తోంది. అనేక అంశాల్లో ఉపయోగపడే డార్విన్ సిద్ధాంతాన్ని కూడా తొలగించింది. తొలగించే ముందు చర్చించిన దాఖలా లేదు. చరిత్రలో వివాదం చేసినట్టు ఇదేమీ వామపక్ష ఉదారవాదానికి, హిందూత్వానికి సంబంధించిన సమస్యకాదు. అనేక అంశాలపైన ఈ మౌలికమైన సిద్ధాంతం ఆధారపడింది. మేధోపరమైన ఆలోచనకు కారణాలకు పునాది అయిన సూత్రాలను ఎన్‌సిఇఆర్‌టి ఇలా తొలగించుకుంటూ పోతే, ఇక విద్యలో 1 నుంచి 10 వరకు గల అంకెలలో ఏది కూడా మిగిలేటట్టు లేదు. అధికారంతో మేధోవాదానికి వ్యతిరేక వాదాన్ని ఆచరిస్తున్నారని స్పష్టమవుతోంది. దీన్నే విస్తృతంగా ప్రదర్శిస్తుంటే చరిత్ర పుస్తకాలు కూడా ఉండకుండాపోతాయి. ప్రజా జీవితంలో ఉండేవారు నిర్మోహమాటంగా తప్పుడు ప్రకటనలను తప్పుడువని చెప్పినప్పుడే మేధావులు, మేధోపరమమైన ఆలోచనలు నిలబడతాయి. మేధో వ్యతిరేక కాలంలో మనం జీవిస్తున్నాం.

ఒక పద్ధతి ప్రకారం పాఠ్యాంశాలను తొలగించడం వల్ల ఈ పుస్తకాలను ఉపయోగించే తరంలో ఏం సాధించదలుచుకున్నారని మనను మనం ప్రశ్నించుకోవాలి. విద్య భారత దేశ సరిహద్దుల మధ్యే ఉన్నట్టయితే ఏమైనా జరగవచ్చు. భారతీయులు మాత్రమే విద్యాపరంగా తిరస్కరణకు గురవుతారు. కేవలం శాస్త్ర విజ్ఞానంలోనే కాదు, మానవీయ శాస్త్రాలలో కూడా జ్ఞానం చాలా వేగంగా పెరుగుతోంది. ఈ ప్రపంచంలో మనం జీవిస్తుంటే, జీవించాలని భావిస్తుంటే, చదువుకున్న భారతీయులు దీన్ని పరిరక్షించుకోవాలని భావిస్తే, ఖాళీలు ఏర్పడిన చరిత్రను చదువుకోవడం ద్వారా, కేవలం భారత సమాజాన్ని తెలుసుకోవడం ద్వారా ఒక అర్థవంతమైన పద్ధతి ద్వారా వివరించడం సాధ్యం కాదు. మానవీయ శాస్త్ర పరిణామంలో చరిత్ర అనేది ఒక గౌరవనీయమైంది. మన జీవితాలను నిర్మించుకోవడానికి ఉపయోగించే జ్ఞానంపైన దృక్పథం స్పష్టత ఆధారపడి ఉంటుంది. గతించిన భారత చరిత్రపైన పలు పరిశోధనా కేంద్రాల్లో చాలా మంది మేధావులు, మన చరిత్ర పుస్తకాల్లో తొలగించిన వాటిపైన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అధ్యయనం కొనసాగుతుంది. విశ్లేషించడానికి కొత్త పద్ధతులు ఉంటాయి. సరికొత్త జ్ఞానంతో భారత దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.

భారత దేశం తప్ప మిగతా అన్ని చోట్లా వీటన్నిటినీ భారత దేశ చరిత్రలో కొనసాగుతాయి. భారత దేశ చరిత్రలో తొలగించిన ఆ భాగాల గురించి భారత దేశంలో ఉన్న మనకు తెలియదు. ఇతర దేశాల్లో భారత దేశ చరిత్ర, సంస్కృతి అధ్యయనంలో భాగంగా మతం, వంశాలకు అతీతంగా భారత దేశం, అది సాధించిన విజయాలను అధ్యయనం చేయగలుగుతాం. గతించిన భారత దేశం గురించే కాకుండా, దానితో ముడిపడి ఉన్న ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న తాజా సంఘటనల గురించి కూడా విశ్వవిద్యాలయాల్లో, గ్రంథాలయాల్లో, వస్తు ప్రదర్శన శాల ల్లో అధ్యయనాలు జరుగుతుంటాయి. భారతదేశ చరిత్రలోనే కాదు, మానవాళి సాధించిన విజయాల చరిత్రలో కూడా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది. భారత దేశ చరిత్రలో భాగంగా, ప్రపంచంలో ఇతర చరిత్రలో భాగంగా ఆ ప్రభావాలు ఏవీ మనం పట్టించుకోకుండా వదిలేస్తాం. ఒకప్పుడు మనం గుర్తించిన సంస్కృతే, మనం ఎంతో సేవ చేసినదే, మనం ఇచ్చిపుచ్చుకున్నదే గత కాలంలో మనం సృష్టించుకున్న భారతీయ సంస్కృతి.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News