Sunday, April 28, 2024

నీరజ్ చోప్రాకు స్వర్ణం….

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra wins gold medal in javelin

టోక్యో: ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. నీరజ్ చోప్రా అనుకున్నట్టుగానే జావెలిన్ త్రోలో బంగారం పతకం సాధించిపెట్టాడు. ఈ బంగారు పతకంతో భారత కీర్తిని ఎవరెస్టు శిఖరం ఎక్కించాడు. ఈటెను నీరజ్ 87.58 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. నీరజ్ మొదటి ప్రయత్నంలో 87.03 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు, మూడోసారి 76.79 మీటర్లు, తరువాత రెండు ఫౌల్స్ పడ్డాయి, ఆరో సారి మాత్రం 84.24 మీటర్లు విసిరాడు. జావిలెన్ త్రో ఆటగాళ్లలో అత్యధిక మీటర్లు 87.58 నీరజ్ విసరడంతో పసిడి గెలుచుకున్నాడు. చెక్ రిప్లబిక్ చెందని జాకూబ్ 86.67 మీటర్లు విసరడంతో రజతం, అదే దేశానికి చెందిన అథ్లెట్ విటెడ్జ్ స్లావ్ 85.44 మీటర్లు విసరడంతో కాంస్యం సాధించారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి తొలి స్వర్ణకారుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News