Thursday, May 2, 2024

నీట్ అభ్యర్థి లోదుస్తుల తొలగింపు… హింసాత్మక నిరసనలు

- Advertisement -
- Advertisement -

NEET Exam Harassment Row Causes Outrage

నీట్ పరీక్ష నిర్వహించిన విద్యాసంస్థపై విద్యార్థుల దాడి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేరళ మహిళా కమిషన్ ఎన్‌టిఎకు వినతి
దర్యాప్తు నివేదిక అందించాలని మానవ హక్కుల సంఘం ఆదేశం

కొల్లాం/న్యూఢిల్లీ : నీట్ అభ్యర్థి లోదుస్తులు తొలగించి పరీక్షించిన తరువాతనే నీట్ పరీక్షకు అనుమతించారన్న ఆరోపణలు మంగళవారం దక్షిణ కేరళ లో నిరసనలకు, హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. ఆదివారం కొల్లాం జిల్లా ఆయుర్ లోని మార్దోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ సంఘటన జరిగింది. పరీక్ష కేంద్రం వద్ద తమను తనిఖీల పేరుతో లోదుస్తులు విప్పాలని సిబ్బంది సూచించారని, లోదుస్తులు తీసేసిన తరువాతనే అనుమతించారని బాధిత యువతి పేర్కొంది. దీనిపై ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ ) ఈ ఆరోపణలన్నీ కల్పితమని, తప్పుడు ఉద్దేశాలతో కూడుకున్నవని పేర్కొంది. ఈ సంఘటనపై పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి తమకు నివేదిక అందించాలని మానవ హక్కుల సంఘం కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది. కేరళ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి సంబంధిత ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

అందిన ఫిర్యాదులపై కేరళ మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. కేరళ ఉన్నత విద్యామంత్రి ఆర్ బిందు ఈ సంఘటనపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినుల గౌరవ హోదాలను భంగపరుస్తూ ‘దిగంబర దాడి’ చేశారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వెలిబుచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించాలని, ఇందులో కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవాలని కేరళ మంత్రి ఆర్ బిందు కోరారు. ఆదివారం నాడే దీనిపై ప్రారంభమైన నిరసనలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలక దారి తీశాయి. ఆందోళన కారుల్లో ఒక వర్గం నిరసన ర్యాలీలను చేపట్టింది. సంఘటన జరిగిన కొల్లాం జిల్లా లోని ప్రయివేట్ ఆయుర్ విద్యాసంస్థపై దాడి చేశారు. పోలీస్ భద్రత వలయాన్ని ఛేదించుకుని కాలేజీ ఆవరణ లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు.

ఆందోళన కారులైన విద్యార్థుల్లో కొందరు గాయపడ్డారు. కేరళ మహిళా కమిషన్ ఇది మహిళలను అవమానపర్చడమేనని పేర్కొంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌టిఎను కోరింది. పరీక్ష కోసం విద్యార్థుల ముఖ్యంగా టీనేజర్ల లోదుస్తులను తొలగించడం మానసికంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫలితంగా పరీక్షపై వారు దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతుందని మహిళా కమిషన్ ఛైర్ పర్మన్ పి.సతీదేవి పేర్కొన్నారు. కేరళ ఎంపి ఎన్‌కే ప్రేమచందన్ స్పందిస్తూ పరీక్షల్లో అవకతవకలు సాంకేతికంగా గుర్తించగలుగుతున్నప్పుడు సాంకేతిక సాయం ఉపయోగించకుండా ఇలా కర్కశంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News